‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
సింగరేణి పరిధిలోని గ్రామాల్లో తీవ్రంగా మారిన కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ధన్బాద్ ఉప సర్పంచ్ భూక్య ప్రేమ్ కుమార్ సోమవారం ప్రజావాణిలో జిల్లా సబ్ కలెక్టర్, డీపీఓకు వినతిపత్రం అందజేశారు. ధన్బాద్, రుద్రంపూర్, గౌతమ్పూర్ తదితర ప్రాంతాల్లో...
చుంచుపల్లి, నవంబర్ 02 : సింగరేణి పరిధిలోని గ్రామాల్లో తీవ్రంగా మారిన కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ధన్బాద్ ఉప సర్పంచ్ భూక్య ప్రేమ్ కుమార్ సోమవారం ప్రజావాణిలో జిల్లా సబ్ కలెక్టర్, డీపీఓకు వినతిపత్రం అందజేశారు. ధన్బాద్, రుద్రంపూర్, గౌతమ్పూర్ తదితర ప్రాంతాల్లో కోతులు మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి, ఫారెస్ట్, రైల్వే, సోలార్ ప్లాంట్ల విస్తరణ పేరిట అడవులను నరికివేయడం వల్లే కోతులకు ఆవాసాలు, ఆహారం కరువై ఊర్లపై పడుతున్నాయని పేర్కొన్నారు. అడవులు తిరిగి పెరిగి, చెట్లకు పండ్లు కాసేవరకు సింగరేణి సంస్థే ఆ కోతులను దత్తత తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్లలో మిగిలిన పండ్లు, కూరగాయలను సేకరించి, సింగరేణి మొక్కలు నాటే ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్ణీత సమయానికి ఆహారం అందించాలని కోరారు. కోతులను పట్టి ఇతర ప్రాంతాల్లో వదిలేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, వాటికి శాశ్వత పునరావాసం కల్పించేలా సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
Osmania University: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. ఓయూలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ర్యాలీ
TTD | ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్ అథారిటీని నియమించిన ప్రభుత్వం
‘రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

