జూలూరుపాడు, మే 19 : పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది పనిచేసే చోట ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎస్ఐ బాధావత్ రవి అన్నారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన హెడ్ కానిస్టేబుల్ అజ్మీర బుచ్చయ్య నాయక్, మహిళా కానిస్టేబుళ్లు శైలజ, సౌజన్య బదిలీపై వెళ్తున్న సందర్భంగా వారిని స్టేషన్లో సన్మానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.