కొత్తగూడెం అర్బన్, జులై 07 : పెండింగ్లో ఉన్న అన్ని డీఏలను చెల్లించాలని పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఎల్.రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రామా టాకిస్ రోడ్డులోని సంగం కార్యాలయంలో జరిగిన
సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత మరణించిన పెన్షన్దారులకు నివాళులర్పించారు. మలిదశలో అనేక ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డీఏ, పీఆర్సీలను రద్దు చేయబోతోందని సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరీ ఇన్చార్జి సీహెచ్ రాజశేఖర్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ జె.నారాయణరావు, మణుగూరు ప్రెసిడెంట్ రాయల సత్యనారాయణ, చుంచుపల్లి యూనిట్ ప్రెసిడెంట్ అంకం పాపయ్య, సెక్రటరీ టి.కోటేశ్వరరావు, సూపర్ సీనియర్ పెన్షనర్లు ఎన్.సుబ్బారావు, జి.ఎం.వి.ప్రసాద్, శేషగిరిరావు, స్వామినాథం పాల్గొన్నారు.
Kothagudem Urban : పెండింగ్ డీఏలు చెల్లించాలి : ఎల్.రాములు