లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితాపై వివిధ రాజకీయ పార్టీల నాయకుల నుంచి అధికారులు అభ్యంతరాలు స్వీకరించారు. శనివారం ఎంపీడీఓ టి.అంకుబాబు, ఎంపీఓ శ్రీనివాస రావు మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా, మరియు పోలింగ్ స్టేషన్ల ముసాయిదాపై సమావేశంలో చర్చించారు. పోలింగ్ బూత్లు, వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను వివరించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలుపాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ గౌస్, ఎండీ హస్మర్ ఖాన్, సీపీఐ నుండి లక్ష్మీపతి, సీపీఎం నుండి కోబాల్, బీఆర్ఎస్ నుండి కొట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.