లక్ష్మిదేవిపల్లి, డిసెంబర్ 27 : పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ లక్ష్మి ప్రసన్న అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. సర్పంచ్ లైలా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని, ఇక్కడే భోజనం చేసి పిల్లలు గుడ్లు తినేలా చూడాలన్నారు. అన్ని పోషకాలు ఉన్న ఆహారం ఐసీడీఎస్లోనే ఉంటుందని తెలిపారు. తన వంతు సహకారం తప్పక ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీను, సూపర్వైజర్ రమాదేవి, టీచర్లు సుజాత. సెక్టార్ టీచర్లు. హెల్పర్లు పాల్గొన్నారు.