రామవరం, జూన్ 10 : వచ్చేది వర్షాకాలం.. పారిశుధ్య పనులపై అలసత్వం వహించవద్దని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ లో పర్యటించారు. ఏరియాలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను ఎప్పటికప్పుడు తొలగించాలని లేకపోతే మురుగు పేరుకుపోయి దోమలకు ఆవాసంగా ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. చెత్తకుండీలో వేసిన చెత్తను తొలగించి ఆ ప్రాంతంలో బ్లీచింగ్ చేయాలని సూచించారు, రుద్రంపూర్ లోని ఉద్యమస్ఫూర్తి ప్రాంగణం పక్కన ఉన్నటువంటి కాల్వలో వర్షాకాలంలో గుట్ట నుండి వర్షపు నీటితో ఉధృతంగా ప్రవహిస్తుందని కాల్వలో ఉన్నటువంటి చెత్త చెదరాన్ని తొలగించాలన్నారు.
లేకపోతే చెత్త మోరీల్లో చేరి వరదకు రోడ్డుమీదికి వస్తుందని అలా కాకుండా ఉండాలంటే వర్షాలు మొదలయ్యే లోపు పూర్తిగా సిల్ట్ తొలగిస్తే గత సంవత్సరం జరిగిన ఇబ్బందులు జరగకుండా ఉంటాయని వాటిని యుద్ద ప్రాతిపదిన పనులు చేపట్టాలని సూచించారు. పనుల పైన రోజువారి పర్యవేక్షణ ఉండాలని, ఏరియాలోని పిచ్చి మొక్కలు దోమలు, విష సర్పాలకు ఆవాసాలుగా మారుతాయని, కావునా వాటిని తొలిగించాలన్నారు. రోడ్లపై ఎక్కడెక్కడ వర్షం నీరు నిలుస్తుందో గుర్తించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వర్షం నీరు నిల్వ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఈ అచ్యుతరామయ్య, మేనేజ్మెంట్ ట్రైనింగ్ సుమంత్, సూపర్వైజర్ మాటేడు శ్రీనివాస్, ప్రైవేటు సూపర్వైజన్ షకీల్, సూర్యం ఉన్నారు.