కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 17 : భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం నాటి హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం రాలేదని, ఆనాటి రాచరికపు వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు వీరోచితమైన పోరాటం వల్ల 17 సెప్టెంబర్ 1948న స్వతంత్ర్య భారతంలో భాగం చేయడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఆనాడు జరిగిన పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ అన్నారు. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర మంత్రివర్గం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని, విద్యార్థులు స్కాలర్షిప్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్, కొట్టి వెంకటేశ్వరరావు, చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాదవత్ శాంతి, తోగరు రాజశేఖర్, హుస్సేన్, ముత్యాల రాజేష్, రంగరాజు రాజేష్, పోతురాజు రవి, ఇక్బాల్, కనక రాజు, బావు సతీష్ యాదవ్, సింధు తపస్వి, సురేష్ యాదవ్, మూడు జయరాం, బూర్గంపహాడ్ మండల ప్రెసిడెంట్ రమణారెడ్డి, మణుగూరు మండల ప్రెసిడెంట్ కుర్రు నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నూకారపు రమేష్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎర్పుల సురేష్, బీసీ సెల్ ప్రెసిడెంట్ అక్కి నర్సింహారావు, సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్, వట్టం రాంబాబు, ఆవుల నర్సయ్య, బానోత్ శ్రీనివాస్, అఖిల్, మహర్షి, పూర్ణ చందర్, లవుడియా పూర్ణ, జానీ పాల్గొన్నారు.
Kothagudem Urban : కొత్తగూడెంలో జాతీయ సమైక్యతా దినోత్సవం