కొత్తగూడెం టౌన్, ఫిబ్రవరి 15: వచ్చే నెల 8న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ జరుగనుంది. ఈ నేపథ్యంలో లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీ. భానుమతి సూచించారు. తెలిపారు. మీ మీద, మీకు తెలిసిన వాళ్ల మీద, బంధువుల మీద కాని, ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని రాజీ (కాంప్రమైజ్) చేసుకోవచ్చని తెలిపారు.
యాక్సిడెంట్, సివిల్, చీటింగ్, చిట్ఫండ్, భూ తగాదాలు, వివాహ సంబంధ, చిన్నచిన్న దొంగతనాలు, ట్రాఫిక్ చాలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్, కుటుంబ తగాదాలు, బ్యాంకు లావాదేవీల, టెలిఫోన్ బకాయిల, కొట్టుకున్న, సైబర్ క్రైమ్లకు సంబంధించిన కేసులను ఈ లోకదాలత్లో రాజీ చేసుకుని, పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాజీయే రాజమార్గం.. అనే నానుడి అక్షరాల నిజం చేసేందుకు ప్రతీ మూడు నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 11,55,993 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో ప్రీ-లిటిగేషన్ కేసులు 5,42,253, వివిధ విభాగాల్లోని పెండింగ్ కేసులు 6,13,740 ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.161.05 కోట్ల పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి.