భద్రాచలం:నవజీవన్ ట్రస్ట్ ట్రస్టీ కే.శ్రీధర్ ఆచార్య ను ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డు ఫర్ దివ్యాంగజీవన్ -2020 వరించింది. దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా కోజియాలం శ్రీధర్ ఆచార్య ఈ అవార్డును అందుకున్నారు.
శ్రీధర్ ఆచార్య 1968-71 వరకు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి సంస్కృత పాఠశాలలో నాటి సంస్కృత పండితులు శ్రీమత్ తిరుమల గుదిమెళ్ల అంతర్వేది నరసింహాచార్య స్వామివారి (ప్రస్తుత సంస్కృత పండితులు గుదిమెళ్ల శ్రీమన్నారాయణాచార్యుల తండ్రి) వద్ద న్యాయ శాస్త్రములు అధ్యయనం చేశారు. అలాగే తిరుపతిలో నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్ అధ్యక్షులుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు.