కొత్తగూడెం, మార్చి 9 : లక్ష్మీదేవిపల్లి ముర్రేడు కొత్త బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారింది. బ్రిడ్జిపై అప్రోచ్ రోడ్డు నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. శ్రీనగర్ రోడ్డు నుండి ప్రారంభం అయ్యే ఈ బ్రిడ్జిపై రోడ్డు అంతా ఒకే లేవల్గా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. నూతన బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణం సరిగ్గా చేయకపోవడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఎగుడు దిగుడుల వల్ల ఒక్కసారిగా బ్రేకులు వేయాల్సి వస్తుండడంతో వెనుక నుండి వచ్చే వాహనాలు వచ్చి గుద్దుకుంటున్నసంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. జాతీయ రహదారుల నిర్వహణ అధికారులకు ఈ విషయమై స్థానికులు, వాహనదారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి బ్రిడ్జిపై సరైన రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతున్నారు.
Murredu New Bridge : ప్రమాదాలకు నిలయంగా ముర్రేడు కొత్త బ్రిడ్జి
Murredu New Bridge : ప్రమాదాలకు నిలయంగా ముర్రేడు కొత్త బ్రిడ్జి