– కొత్తగూడెంలో కార్పొరేషన్లో ఎంపీ వద్దిరాజు ఇంటింటి ప్రచారం
భద్రాద్రి కొత్తగూడెం. ఫిబ్రవరి 05 : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల తేదీ దగ్గరికి రావడంతో వార్డుల్లో ప్రచారం ఉపందుకుంది. పట్టణంలోని బూడిద నుండి ఓల్డ్ వరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం కోసం కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి ఇచ్చి కాంగ్రెస్ విధానాలను ఎండగట్టారు. కొత్తగూడెం కార్పొరేషన్లో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని వద్దిరాజు తెలిపారు. ప్రధాన సెంటర్లలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు.

MP Vaddiraju : పాదయాత్ర చేస్తూ బాకీ కార్డులు పంచుతూ
అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రెండేళ్లయిన ఒక్క హామీ కూడా అమలు చేయలేక పోయిందని ఆయన విమర్శించారు. బీఅరస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ హయాంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. ఈ ప్రచారంలోమున్సిపల్ మాజీ చైర్మన్ సీతాలక్ష్మి, డివిజన్ అభ్యర్థులు వేల్పుల వీరమ్మ, శివకుమార్, ఇమంది గణేష్, కొట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

MP Vaddiraju : పాదయాత్ర చేస్తూ బాకీ కార్డులు పంచుతూ