దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్త శ్రీరాములు చిన్న కుమారుడు గోపి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వెంట స్థానిక టీఆర్ ఎస్ నాయకులు ఉన్నారు.