బూర్గంపహాడ్, ఏప్రిల్ 11 : బూర్గంపహాడ్ మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ కార్యాలయంలో జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తొలుత బూర్గంపహాడ్‌లోని రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్కూల్ యాజమాన్యం పలు సమస్యలపై వినతిపత్రం అందజేయగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బూర్గంపహాడ్ పంచాయతీ గౌతాపురంలో తల్లపురెడ్డి నాగేశ్వరి, నీరుడు రమణ లబ్దిదారుల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, పంచాయతీరాజ్ డీఈ పొదెం వెంకటేశ్వర్లు, ఏఈ చారి, డీటీ సమ్మయ్య, మాజీ సొసైటీ అధ్యక్షుడు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, నాయకులు భజన సతీష్, ప్రసాద్, కైపు శ్రీనివాసరెడ్డి, దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, చిప్పా రాజు, ఇంగువ రమేష్, గుద్దేటి ప్రవీణ్, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చల్లా వెంకటరమణ, బర్ల నాగమణి, ఎడమకంటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.