అశ్వారావుపేట : నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని, అందుకే పేద కుటుంబాల్లో ఆనందం కోసం ఉచితంగా నూతన దుస్తులు అందిస్తుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అన్నారు. అశ్వారావుపేట చర్చిలో మంగళవారం ఆయన లబ్దిదారులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, తెలంగాణ పథకాలను కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని వివరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మీ, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, మండల రైతు సమన్వయ సమితి అద్యక్షులు జూపల్లి రమేష్, వైస్ ఎంపీపీ చిట్లూరి ఫణీంద్ర, అశ్వారావుపేట, ఊట్లపల్లి సర్పంచ్లు అట్టం రమ్య, తహశిల్థార్ చల్లా ప్రసాద్, టీఆర్ఎస్ మండల అద్యక్షులు బండి పుల్లారావు, నాయకులు కోటగిరి సీతారామస్వామి, సత్యవరపు సంపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.