రామవరం, అక్టోబర్ 16 : కొత్తగూడెం ఏరియాలోని మైన్స్ & ఉపరితల గనుల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు జీఎం పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. కొత్తగూడెం ఏరియాలోని బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు రవాణా, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కేటాయించిన నిధులతో కొత్తగూడెం ఏరియాలోని పరిసర గ్రామాల్లో చేస్తున్న వివిధ అభివృద్ధి పనులను జీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం జి.వి కోటిరెడ్డి, డిజిఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, ఏ.ఐ.టి.యు.సి యూనియన్ ప్రతినిధులు, ఇతర యూనియన్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.