రామవరం : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ ప్రక్రియలో లోపాలను తక్షణమే సవరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షుడు ఎం.డీ యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తు చేస్తుంటే వివరాలు తీసుకోవటం లేదని పాషా చెప్పారు. వేలమంది నిరుద్యోగులు అర్హులైనప్పటికీ వారి వివరాలు తీసుకోకపోవటం విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోలేకపోతుండటంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వెంటనే పోర్టల్లో లోపాలను సవరించి గడువు తేదీని పెంచాలని కోరారు.