‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ చొరవ భేష్
రియల్టర్లు, బ్యాంకర్ల స్టాళ్ల నిర్వహణ అభినందనీయం
రియల్ ఎస్టేట్‌కు అనుకూలంగా భద్రాద్రి జిల్లా
ప్రాపర్టీ షో సందర్శనలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
చక్కటి వేదిక: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
కొత్తగూడెంలో ముగిసిన ప్రాపర్టీ షో
కొత్తగూడెం అర్బన్, మార్చి 20: కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని క్లబ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రెండోరోజు ఆదివారం నిర్వహించిన షోను మంత్రి అజయ్‌కుమార్ సందర్శించారు. ఇండ్లు, ప్లాట్లు కొనుగోలు చేసేవారికి రియల్ ఎస్టేట్ రంగంపై అవగాహన కల్పించేందుకు పత్రికా యాజమాన్యాలు చక్కటి వేదిక ఏర్పాటు చేశాయన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు స్టాళ్లలో ప్రజలకు ప్లాట్లు, ఇండ్ల కొనుగోలుపై సమగ్ర అవగాహన కల్పించాయన్నారు. భద్రాద్రి జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని, మున్ముందు మరిన్ని ప్రాపర్టీ షోలు నిర్వహించాలన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు నిర్మించుకోవాలని కోరుకుంటున్నారన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రాపర్టీ షో నిర్వహణ అభి నందనీ యమన్నారు. ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేసేవారి భయాలను పోగొట్టేలా స్టాళ్లు ఏర్పాటయ్యాయన్నారు. షో నిర్వహించిన పత్రికా యాజమాన్యాలకు అభినందనలు తెలిపారు.
ఇండ్లు, ప్లాట్లు కొనుగోలు చేసేవారికి రియల్ ఎస్టేట్ రంగంపై అవగాహన కల్పించేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ చక్కటి వేదిక ఏర్పాటు చేశాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కొత్తగూడెంలోని క్లబ్లో రెండోరోజు ఆదివారం ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన సందర్శించారు. స్థలం, ఇల్లు కొనే శక్తి ఉన్నా కొందరు రియల్ ఎస్టేట్ రంగంపై అవగాహన లేక ఇబ్బంది పడుతుంటారని, అలాంటి వారికి ప్రాపర్టీ షో మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ సంస్థలు స్టాళ్లలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నాయన్నారు. స్టాల్స్‌ను పరిశీలించి రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో మాట్లాడారు. వెంచర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు.
భద్రాద్రి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. త్వరలోనే జిల్లాకేంద్రంలో కలెక్టరేట్, మెడికల్ కళాశాల పూర్తవుతాయన్నారు. దీంతో కొత్తగూడెం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. ప్రస్తుతం అపార్టుమెంట్ సంస్కృతి అంతటా వ్యాపించిందని, పట్టణ ప్రాంతాల్లో మరిన్ని అపార్ట్మెంట్లు నిర్మించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సూచించారు. రియల్టర్లు పట్టణాభివృద్ధికి సహకరించాలన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే పట్టణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ‘నమస్తే తెలంగాణ’ ఖమ్మంలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు అపూర్వ ఆదరణ లభించిందని, కొత్తగూడెంలోనూ ఇదే స్థాయిలో ప్రజల నుంచి స్పందన లభించిందన్నారు.
డివెన్ హోమ్స్, శ్రీనివాస హైట్స్, శ్రీబాలాజీ ఎస్టేట్స్, శ్రీ జయవిలాసిని, శ్రీ సిటీ, సిక్త్స్ ఎలిమెంట్స్, గెలాక్సీ, వీఎంఆర్ ప్రైమ్ ఇన్ఫ్రా, ఎస్కేటీ, సప్త వర్ణ, మాన్వి కన్స్ట్రక్షన్స్, తాటిపల్లి ఇన్ఫ్రా, నెల్లూరి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, సమూహ ప్రాజెక్ట్ లిమిటెడ్, పెన్నా సిమెంట్, మార్వెల్ హోమ్స్, ఆదిత్య బిల్డర్స్, గూగీ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ సంస్థలు షోలో స్టాళ్లు నిర్వహించాయి. గిఫ్ట్ పార్టనర్స్‌గా టీ న్యూస్, నీలోఫర్ సంస్థలు వ్యవహరించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు షోకు వచ్చిన వారికి రుణ సదుపాయాల గురించి వివరించారు. కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు దమ్మాలపాటి శ్రీనివాసరావు, కుంచవరపు రమేశ్‌బాబు, గరికపాటి విజయ్‌బాబు, ప్రేమ్‌సాయి, రాంబాబు, అరుణ్ చైతన్య, దోసపాటి వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, ఎల్లంకి నరేశ్, తాటిపల్లి శంకర్‌బాబు, గోపినాథ్, ఎస్కే అజ్జు, శ్రీనివాస్, చావా రమణ, కనుకుంట్ల కుమార్, రామకృష్ణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీ మేరెడ్డి వసంత, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, కౌన్సిలర్లు మోరె రూప, కౌడగాని పరమేశ్, చుంచుపల్లి ఎంపీపీ బదావత్ శాంతి, టీఆర్ఎస్ నాయకులు మహ్మద్ యూసుఫ్, ఎంఏ రజాక్, మోరె రమేశ్, రావి రాంబాబు, బీమా శ్రీధర్, మోరె భాస్కర్‌రావు, బండి రాజుగౌడ్, హుస్సేన్, మధు, మహేశ్, రియాజ్, ఇమ్రాన్, టీబీజీకేఎస్ రీజినల్ కమిటీ సభ్యుడు కూసన వీరభద్రం, ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్‌మెంట్ జీఎం ఎన్.సురేందర్‌రావు, డీజీఎం రాజిరెడ్డి, బ్రాంచ్ మేనేజర్ రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జ్ మాటేటి వేణుగోపాల్, అడ్వైర్టెటైజ్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ బోయిన శేఖర్‌బాబు, స్టాఫ్ రిపోర్టర్ కాగితపు వెంకటేశ్వరరావు, యాడ్స్ ఆఫీసర్లు ఉల్లోజు వెంకన్న, పసుపులేటి నాగరాజు, సోలిపురం సురేందర్‌రెడ్డి, పుట్టా ప్రభాకర్, శేరి శ్రీనివాస్, సర్క్యూలేషన్ మేనేజర్ కనగంటి రాంబాబు, సర్క్యూలేషన్ ఏసీవోలు భద్రం, ప్రసాద్, రాము పాల్గొన్నారు.
సందేహాల నివృత్తికి చక్కటివేదిక: ప్రభుత్వ విప్ రేగా
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తుందన్నారు. ప్రతిఒక్కరూ సొంత ఇల్లు నిర్మించుకోవాలని కోరుకుంటున్నారన్నారు. ఇలాంటి సందర్భంలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రాపర్టీ షో నిర్వహించడం అభినందనమన్నారు. చక్కటి వేదిక ఏర్పాటు చేసి ప్రజల సందేహాలను నివృత్తి చేస్తున్న రియల్టర్లు, బ్యాంకర్లను అభినందించారు. ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేసేవారి భయాలను పోగొట్టేలా షో ఉందన్నారు.
ప్రాపర్టీ షోకు విశేష స్పందన..
రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన లభించింది. ఈ షో లో కొత్తగూడెం, సుజాతనగర్, పాల్వంచతో పాటు ఖమ్మం, హైదరాబాద్‌కు చెందిన 22 రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, బ్యాంకర్లు స్టాళ్లు ఏర్పాటు చేసి స్థలాలు, ఇండ్ల కొనుగోలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. రుణ సదుపాయం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై వివరించారు. రెండో రోజు కార్యక్రమానికి రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరయ్యారు.
స్టాళ్లను సందర్శించారు. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. రుణ సదుపాయాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ఆరా తీశారు. ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. రియల్టర్లు వెంచర్ల ఏర్పాటు, అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని రియల్ ఎస్టేట్ అధినేతలకు సూచించారు. అనంతరం మంత్రి అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగాకాంతారావును శ్రీశ్రీనివాస హైట్స్ రియల్ ఎస్టేట్స్ అధినేత దమ్మాలపాటి శ్రీనివాసరావు సన్మానించారు. అనంతరం సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్ నరసింహరావు లక్కీ డ్రాలో గెలుపొందిన విజేత పి.అనీల్‌కు బహుమతి అందజేశారు.
సందేహాలను నివృత్తి చేశాం..
ప్రాపర్టీ షోలోని స్టాల్ ద్వారా కొనుగోలుదారుల భయాలను పోగొట్టాం. సందేహాలను నివృత్తి చేశాం. వారు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాం. ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా ముందు వినియోగదారుల అనుమానాలను తొలగించడం ముఖ్యం. ఈ కారణంతో మేం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మా సంస్థకు నిర్మాణం, సిమెంట్, విద్యుత్, శానిటరీ రంగాల్లో కంపెనీలు ఉన్నాయి. మా పరిధిలో తక్కువ ధరలకు ప్రజలకు మంచి ప్రోడక్ట్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
– నారాయణశర్మ, సప్తవర్ణ ఎంటర్ప్రైజెస్ మార్కెటింగ్ మేనేజర్
ప్రజలకు ఎంతో ఉపయోగం..
తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ అద్భుతం. ప్రజలకు చక్కగా ఉపయోగపడ్డాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు, నిర్మాణ రంగం, సిమెంట్, విద్యుత్, శానిటరీ, టైల్స్, ప్లంబింగ్ సంస్థలు.. ఇలా ఒకటేమిటి అన్నిరకాల స్టాల్స్ షోలో ఏర్పాటయ్యాయి. మేం కంపెనీ ప్రారంభించిన నాలుగేండ్లలో వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతోనే. భద్రాద్రి జిల్లా ప్రజలకు రియల్ ఎస్టేట్ రంగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మేం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి స్టాల్ ఏర్పాటు చేశాం. – దుర్గాప్రసాద్, గూగీ సంస్థ డైరెక్టర్
రియల్ ఎస్టేట్ రంగానికి భవిష్యత్తు..
ప్రాపర్టీ షో విజయవంతమైంది. మేం మొదటిసారి ఈ షోలో స్టాల్ ఏర్పాటు చేశాం. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పట్టణవాసులు ఇండ్లు, ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని అర్థమైంది. రియల్ ఎస్టేట్ రంగానికి భవిష్యత్తు ఉందని నమ్మకం ఏర్పడింది. నమ్మకమైన సంస్థలకు సరైన వేదికగా ప్రాపర్టీ షో అయింది.
– దమ్మాలపాటి శ్రీనివాసరావు, శ్రీశ్రీనివాస హైట్స్ అధినేత
రియల్ ఎస్టేట్ రంగం
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోందని గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో జరిగిన ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా కంపెనీలు ప్రదర్శించిన స్టాల్స్‌ను సందర్శించారు. కొత్త జిల్లాలో రియల్ ఎస్టేట్ ద్వారా భవన నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, హైదరాబాద్ స్థాయిలో ఉండే బిల్డర్స్ వ్యాపారం మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకుందన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగడం వల్లనే ఇలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చాయన్నారు. గతంలో ఎక్కడా బిల్డర్స్ వచ్చి భవన నిర్మాణాలు చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే ఇలాంటి రంగానికి ప్రోత్సాహం లభించిందని చెప్పారు.
కొత్తజిల్లాలో తొలిసారిగా నిర్వహించిన ప్రాపర్టీ షో ను ‘నమస్తే తెలంగాణ’ బృందం పూర్తిస్థాయిలో విజయవంతం చేసిందని అన్నారు. రానున్న రోజుల్లో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలోనే వరంగల్‌లో ప్రాపర్టీ షో ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ… బిల్డర్స్, రియల్ ఎస్టేట్స్ గురించి తెలియని సమాచారాన్ని నమస్తే తెలంగాణ అందరికీ తెలియజేసిందని చెప్పారు. 15 రోజులుగా కష్టపడి ఒక షోను సక్సెస్ చేసిన ఉమ్మడి ఖమ్మం, కొత్తగూడెం బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రాపర్టీ షో, వెంచర్స్, బిల్డర్స్ నిర్వాహకులు నమస్తే తెలంగాణ బృందానికి మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ జీఎం రవీందర్ రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ రమేశ్, బ్యూరో ఇన్చార్జి వేణుగోపాల్, చుంచుపల్లి ఎంపీపీ బదావత్ శాంతి, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, పరమేశ్ యాదవ్, యాకూబ్, మొక్కల వెంకటయ్య, మల్లెల ఉషారాణి, చుంచుపల్లి మండల అధ్యక్షుడు ఉమర్ తదితరులు పాల్గొన్నారు.