భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 17 : చిరు ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ అధికారి సర్ణలత లెనీనా అన్నారు. జిల్లా కేంద్రం లక్ష్మీదేవీపల్లి మండలం అశోక్‌నగర్ అంగన్వాడీ సెంటర్లో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీ స్థాయి నుండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.
మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కావునా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ఆరోగ్య లక్ష్మి భోజనం చేయ్యాలని సూచించారు. అనంతరం పలువురు గర్భిణీలకు సీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ లక్ష్మీప్రసన్న, సూపర్వైజర్ రమాదేవి, వైద్యురాలు నూరీ, హెచ్ఎం శ్రీలత, కౌన్సిలర్ కల్యాణి. ఏఎన్ఎం జ్యోతి. హబ్ కో ఆర్డినేటర్ రూప, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
Bhadradri Kothagudem : చిరు ధాన్యాలతో ఆరోగ్యానికి మేలు : స్వర్ణలత లెనీనా