బూర్గంపహాడ్, జూలై 06 : బూర్గంపహాడ్కు చెందిన షేక్ ఆశా, గౌతంపురం కాలనీకి చెందిన షేక్ మహబూబ్ అలీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన సారపాకకు చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) బాధ్యులు సోమవారం వారి నివాసాలకు వెళ్లి వైద్య ఖర్చుల కోసం ఒక్కరికి రూ.5 వేల చొప్పున రూ.10 వేలు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మేవా అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తమవంతు ఆర్థిక సాయం అందిస్తున్నామని, సమాజంలో ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలవడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. భవిష్యత్లో కూడా తమ సంస్థ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేవా బాధ్యులు షేక్ దస్తగిరి, మహమ్మద్ ఇమ్రాన్, సోహెల్పాషా, ఖమర్, అబ్దుల్ సలీమ్, రెహమాన్ గౌస్ పాల్గొన్నారు.