రామవరం, జనవరి 17 : కొత్తగూడెం టూ టౌన్ పరిధిలోని నాగయ్య గడ్డ ప్రాంతంలో మతి స్థిమితం లేని బాలిక(19 )పై శుక్రవారం రాత్రి జరిగిన అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తగూడెం 2 టౌన్ సీఐ ప్రతాప్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి నిందితుడు చింతల హరికృష్ణ @ హరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రతాప్ తెలిపారు.