కాంగ్రెస్ పాలనలో అందని సర్కార్ వైద్యం.. గండ్ర వెంకటరమణరెడ్డి ఆగ్రహం
గత బీఆర్ఎస్ పాలనలో రోగులకు వరంగా ఉన్న భూపాలపల్లిలోని ప్రభుత్వ దవాఖాన కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన తనిఖీ చేశారు.
- భూపాలపల్లి దవాఖానలో అధ్వానంగా మరుగుదొడ్లు
- 9 నెలలుగా తాగునీరులేక అవస్థలు
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ పాలనలో రోగులకు వరంగా ఉన్న భూపాలపల్లిలోని ప్రభుత్వ దవాఖాన కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులు రమణారెడ్డి వద్దకొచ్చి దవాఖానలోని సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మీడియాతో మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లా ప్రజలతో పాటు, సమీపంలోని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చే రోగులకు అత్యవసర వైద్య సేవలందించాల్సిన జిల్లా జనరల్ దవాఖాన నేడు సమస్యలకు నిలయంగా మారిందని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోగులకు అన్ని వసతులు కల్పిం చి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించామని గుర్తుచేశారు. అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారని వివరించారు. జిల్లా జనరల్ దవాఖానకు వైద్యం కోసం వచ్చిన రోగులకు సరైన సేవలు అందించకుండా ఇతర దవాఖానలకు రిఫర్ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
రోగుల బాధలు విం టుంటే ఇది ప్రభుత్వ దవాఖాననా…? లేక రిఫరల్ సెంటరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 9నెలలుగా మంచినీటి సమస్య నెలకొందని, ఐదు రోజుల నుంచి పూర్తిగా అందడం లేదన్నారు. దీంతో డబ్బులు వెచ్చించి బయట తాగునీరు కొనుగోలు చే యాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

