భధ్రాచలం, మార్చి 24 : చెల్లని చెక్కు కేసులో వ్యక్తి దోషిగా తేలడంతో న్యాయస్థానం అతడికి 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు జడ్జి వి.శివనాయక్ సోమవారం ఈ తీర్పును వెలువరించారు. కేసు వివరాలు.. సారపాక కు చెందిన జాదవుల కనకయ్య వద్ద బయ్యారానికి చెందిన నాగారపు వెంకటేశ్వర్లు చెక్కు హామీగా పెట్టి రూ.2,60,000/- తీసుకున్నాడు. చెక్ బ్యాంక్లో వేయగా బౌన్స్ అయింది. దీంతో వెంకటేశ్వర్లుపై కనకయ్య చెక్ బౌన్స్ కేసు వేశాడు. విచారణలో వెంకటశ్వర్లు దోషిగా తేలడంతో న్యాయస్థానం అతడికి 6 నెలల జైలు, రూ.2.60 లక్షలను జరిమానాగా విధించింది. ఫిర్యాదుదారుడి తరుపున ప్రముఖ న్యాయవాది ముత్యాల కిశోర్ వాదనలు వినిపించారు.