బూర్గంపహాడ్, మే 02 : బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామంలో మాజీ వార్డు మెంబర్ సోడె గోపయ్య (50) తన చేసులో నువ్వులు వర్షానికి తడవకుండా ఆరబోస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుపడింది. దీంతో గోపయ్య అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. కుటుంబసభ్యులు గోపయ్య మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. అదేవిధంగా గ్రామంలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడడంతో చెట్టు కాలిపోయింది.
మండల పరిధిలోని సారపాక భాస్కర్నగర్ ఎస్టీ కాలనీలో రెండు రేకుల ఇళ్లు శనివారం గాలి దుమారంతో కూడిన వర్షానికి కూలిపోయాయి. భాస్కరనగర్ ఎస్టీ కాలనీలో పెట్టి మధు, హాయ్లాల రత్నం ఇంటి పైకప్పుతో ఉన్న రేకులు ఎగిరిపోవడంతో పాటు ఒక ఇల్లు రేకులతో సహా కూలిపోయింది. అకాల గాలి దుమారంతో కురిసిన వర్షంతో ఈ నష్టం జరగడంతో బాధితులు నిరాశ్రయులయ్యారు.

ఇరవెండిలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి