దమ్మపేట, జూలై 07 : దమ్మపేట మండలంలోని అంకమాపాలెం పాఠశాలలో గుప్పెడు గింజల (సీడ్ బాల్స్) తయారీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ చందన, దమ్మపేట ఏటిడీఓ చంద్రమోహన్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. డీడీ, పీఓ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మట్టి, ఎరువు, వివిధ రకాల విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థులు తయారు చేసిన గుప్పెడు గింజలను వర్షాకాలంలో వివిధ ప్రాంతాల్లో చల్లి పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన, బాధ్యత పెంపొందుతుందన్నారు.