కస్టడీ వేధింపుల ఆరోపణలపై పారదర్శక విచారణ చేయండి
పోలీసు కస్టడీలో అక్రమ నిర్బంధం, చిత్రహింసల ఆరోపణలను అత్యంత పారదర్శకంగా విచారించాలని నగర పోలీసు కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తిని చట్టవిరుద్ధంగా అదుపులో ఉంచి హింసించారన్న ఆరోపణలపై ఆధారాలను పరిశీలించి బాధితుడు సమర్పించిన ఫిర్యాదుపై తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
- సీపీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : పోలీసు కస్టడీలో అక్రమ నిర్బంధం, చిత్రహింసల ఆరోపణలను అత్యంత పారదర్శకంగా విచారించాలని నగర పోలీసు కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తిని చట్టవిరుద్ధంగా అదుపులో ఉంచి హింసించారన్న ఆరోపణలపై ఆధారాలను పరిశీలించి బాధితుడు సమర్పించిన ఫిర్యాదుపై తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
పి. శ్రీకాంత్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ టి. మాధవీదేవి విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కదిరే అజిత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, జూలై 17న పోలీసులు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని 24 గంటలకు మించి అక్రమంగా నిర్బంధంలో ఉంచారని, అనంతరం మాత్రమే రిమాండ్‌కు తరలించారన్నారు. నేరాన్ని అంగీకరించాలని ఒత్తిడి చేయడంతో పాటు, హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని వేధించారన్నారు.
మలక్‌పేట స్టేషన్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితుడికి పరిహారం కూడా అందించాలని కోరుతూ జూలై 21న డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. వాదనలను పరిశీలించిన హైకోర్టు, నిర్బంధ సమయంలోని సీసీటీవీ ఫుటేజీ, వైద్య ఆధారాలను తప్పనిసరిగా పరిశీలించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితుడి వినతిపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్‌పై విచారణను ముగించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

