చుంచుపల్లి, జనవరి 10 : ఈ నెల 26వ తేదీన నిర్వహించే 77వ రాజ్యాంగ అమలు దినోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని అంబేద్కర్ యువసేన సభ్యులు కోరారు. ర్యాలీ గౌతమ్పూర్ అంబేద్కర్ సెంటర్ నుండి రుద్రంపూర్ అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా శనివారం అంబేద్కర్ యువసేన సభ్యులు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కొంకటి కృష్ణ, రాసపల్లి రాజేంద్రప్రసాద్, కరుణాకర్, పొన్నగంటి రాజు, జనార్ధన్, మధుకర్, ఈ.సుబ్బు, హుస్సేన్ పాల్గొన్నారు.