– బీఆర్ఎస్ బూర్గంపహాడ్ మండలాధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి
బూర్గంపహాడ్, ఏప్రిల్ 18 : ఖమ్మం పట్టణంలోని మమతా కళాశాల గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగే బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి శనివారం పిలుపునిచ్చారు. పార్టీ ప్లీనరీ సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్, రేగా కాంతారావు హాజరవుతున్నారని, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి ముందుగా ఉమ్మడి జిల్లాలో ఈ పార్టీ ప్లీనరీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లీనరీని విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీటీసీలు, మాజీ సొసైటీ అధ్యక్షులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, విద్యార్ధి విభాగం, అనుబంధ సంఘాల బాధ్యులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.