Kajal Aggarwal | డబ్బు కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను .. బోల్డ్ సీన్స్‌పై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు
Kajal Aggarwal | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరోసారి తన వ్యక్తిగత అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. సినిమాల్లో బికినీ, బోల్డ్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్‌పై ఇటీవల జరుగుతున్న చర్చల మధ్య ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేయడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో కాజల్ స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Kajal Aggarwal | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరోసారి తన వ్యక్తిగత అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. సినిమాల్లో బికినీ, బోల్డ్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్‌పై ఇటీవల జరుగుతున్న చర్చల మధ్య ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేయడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో కాజల్ స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ‘ది ఇండియా స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కాజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెరీర్ ప్రారంభం నుంచే తాను బికినీ లేదా అతిగా బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ఆసక్తి చూపలేదని తెలిపారు. అలాంటి పాత్రలు చేయడం తనకు వ్యక్తిగతంగా అసౌకర్యంగా అనిపిస్తుందని, అందుకే ఎన్నో భారీ చిత్రాలను కూడా వదులుకున్నానని వెల్లడించారు.
సినిమాల కోసం లేదా డబ్బు కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను. నాకు కొన్ని విలువలు, సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని నేను ఎప్పుడూ రాజీ పడను. తెరపై బోల్డ్ సీన్స్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావించను అని కాజల్ స్పష్టం చేశారు. తల్లి అయిన తర్వాత తన ఆలోచనల్లో మరింత మార్పు వచ్చిందని కూడా ఆమె తెలిపారు. తన కుమారుడు నీల్ కిచ్లూ పెద్దయ్యాక తన సినిమాలు చూసి గర్వపడాలని కోరుకుంటానని, తన నటించిన పాత్రల గురించి భవిష్యత్తులో తన బిడ్డకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో కథలు, పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
నా కొడుకు నా సినిమాలు చూసి గర్వపడాలి. అతను అసౌకర్యంగా ఫీలయ్యే పాత్రలు నేను చేయాలనుకోవడం లేదు. అందుకే ఇప్పుడు ప్రతి కథను చాలా ఆలోచించి ఎంపిక చేసుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల ‘టాక్సిక్’ సినిమాలో యశ్‌తో కలిసి నటించిన కియారా అద్వానీ రొమాంటిక్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన నేపథ్యంలో కాజల్ పాత వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత హీరోయిన్లు బోల్డ్ సీన్స్ చేయడంపై జరుగుతున్న చర్చల మధ్య కాజల్ తన వ్యక్తిగత విలువలను మరోసారి స్పష్టం చేయడంతో నెటిజన్లు ఆమె అభిప్రాయాలపై భిన్నంగా స్పందిస్తున్నారు. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుండగా, తెలుగులో ఆమె ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. దీంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు కాజల్ సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

