టేకులపల్లి, మే 07 : మొక్కజొన్న కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు గురువారం ఆందోళనకు దిగారు. కోనుగోలు కేంద్రం వద్ద 4 రోజులుగా మక్క కోనుగోలు చేయట్లేదని విమర్శించారు. ఎర్రటి ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నా రైతులను పట్టించుకునేవారు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనుగోలు చేసి ఇక్కడ స్టాక్ పెట్టడానికి స్థలం లేదని, కారేపల్లి వద్దకు వెళ్లాలని చెబుతున్నారని రైతులకు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కు తాళం వేశారని, రైతులుకు మంచినీటి సౌకర్యం కుడా లేదని విమర్శించారు. రోడ్డుపై బైఠాయించోద్దని, కేసులైతాయని రైతులతో పోలీసులు అనడంతో కేసులకైనా సిద్ధంగా ఉన్నామని, ఉన్నతాధికారులు రావాలని, మొక్కజొన్న కోనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

టేకులపల్లిలో మొక్కజొన్న రైతుల ఆందోళన
వాహనాలు ఎక్కడిక్కడ నిలిపోవడంతో టేకులపల్లి ఎస్ఐ అలకుంట రాజేందర్ రైతుల వద్దకొచ్చి సమస్యను పరిష్కరిస్తామనడంతో ధర్నాను విరమించారు. అనంతరం మార్కెట్ యార్డ్ వద్ద తాసీల్దార్ ఎల్.వీరభద్రం, ఏఓ అన్నపూర్ణ, బేతంపూడి సోసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తామని, స్టాక్ ఎక్కడ పెట్టాలో ప్రయత్నాలు చేస్తున్నమని, కారేపల్లి గోడౌన్ వద్ద నిల్వ చేయడానికి అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. లారీలు రాకపోవడంతో సమస్య తలెత్తుతుందని, రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని, ప్రస్తుతం మార్కెట్కు వచ్చిన మొక్కజొన్నను కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారు.

టేకులపల్లిలో మొక్కజొన్న రైతుల ఆందోళన