తుఫాన్ ధాటికి కొట్టుకుపోయిన లో లెవల్ చప్టా
ములకలపల్లి మండల పరిధిలోని పూసుగూడెం–వీకే రామవరం మధ్య ఉన్న లో లెవల్ చప్టా మురసు తుఫాన్ ప్రభావంతో వచ్చిన వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో గురువారం బీఆర్ఎస్ నాయకులు, స్థానిక సర్పంచ్ గుగులోత్ ధర్మా, తాటి రవి చప్టాను పరిశీలించారు.
– వంతెన నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
– రూ.1.60 కోట్లు మంజూరు చేసినా ప్రారంభానికి నోచుకోని పనులు
ములకలపల్లి, నవంబర్ 05 : ములకలపల్లి మండల పరిధిలోని పూసుగూడెం–వీకే రామవరం మధ్య ఉన్న లో లెవల్ చప్టా మురసు తుఫాన్ ప్రభావంతో వచ్చిన వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో గురువారం బీఆర్ఎస్ నాయకులు, స్థానిక సర్పంచ్ గుగులోత్ ధర్మా, తాటి రవి చప్టాను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూసుగూడెం నుండి వీకే రామవరం, సంజీవపల్లి, కొత్తూరు తదితర గ్రామాల మీదుగా బూర్గంపాడు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ చప్టా ఉందని తెలిపారు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షాలకే చప్టాపై నుండి వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 2024లో ప్రభుత్వం హై లెవల్ వంతెన నిర్మాణానికి రూ.1.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఆర్భాటంగా శంకుస్థాపన కూడా నిర్వహించారని గుర్తుచేశారు.
దీంతో తమ కష్టాలు తీరుతాయని భావించిన గ్రామస్తులకు నిరాశే మిగిలిందన్నారు. శంకుస్థాపన జరిగి ఇంతకాలం గడుస్తున్నా వంతెన నిర్మాణ పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదని విమర్శించారు. బుధవారం కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగి చప్టా పూర్తిగా కొట్టుకుపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హై లెవల్ వంతెన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుఫాన్ ధాటికి కొట్టుకుపోయిన లో లెవల్ చప్టా
AP News | పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సును పగులగొట్టిన వైసీపీ..!
AP News | కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
Delhi Building Collapse | మా ఇల్లే కూలిపోతుందేమోనని పరుగులు పెట్టాం.. ఢిల్లీ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి
‘ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

