రామవరం, ఆగస్టు12 : పివికే.5 ఇంక్లైన్ నందు అత్యధిక గైర్హాజరు ఉంటుందని, అందువల్ల గనికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడంలో వెనుకంజలో ఉన్నందున గైర్హాజరు శాతాన్ని తగ్గించి, ఉత్పత్తిని పెంచాలని ఏరియా ఎస్ ఓ టు జిఎం జి.వి కోటిరెడ్డి అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడం ఏరియా పరిధిలోని పివికే5 ఇంక్లైన్ గనిలో ఏర్పాటు చేసిన మల్టీ డిపార్ట్మెంట్ టీం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో గనిలో ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఉత్పత్తి సాధించినందుకు గని ఉద్యోగులందరికీ మల్టీ కమిటీ టీమ్ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏజెంట్, పివికే.5 ఇంక్లైన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరం అంకితభావం, సమిష్టి కృషితో నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచుదాం.. సంస్థను ముందుకు తీసుకుపోదామని కార్మికులను కోరారు. అనంతరం డిజిఎం(ఐఈడి) ఎన్.యోహాన్ ఉద్యోగుల సంక్షేమ కోసం సింగరేణి సంస్థ తీసుకుంటున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగులందరికీ వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఫైనాన్స్) కె.హనా సుమలత, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, డీజీఎం (పర్సనల్), జి.వి.మోహన్ రావు, పివికే.5 ఇంక్లైన్ ఏజెంట్ రామ్ భరోస్ మహాతో, మేనేజర్ ఎం.వి.ఎన్. శ్యాం ప్రసాద్, ఎస్.ఈ (ఐఈడి). కె.ఆర్.నాగభూషణం, గని రక్షణ అధికారి వై.వి.ఎస్.కె.కిశోర్ బాబు, సంక్షేమ అధికారి షేక్. షకీల్, ఇతర ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.