ఇల్లెందు, జూలై 24 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి, హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అయిత ఫంక్షన్ హాల్లో తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పార్టీ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు పాల్గొని రక్తందానం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జెకె శ్రీను, టేకులపల్లి మండలాధ్యక్షుడు బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్, ఎస్.రంగనాథ్, జాఫర్ హుస్సేన్, పరుచూరి వెంకటేశ్వర్లు, సిలివేరు సత్యనారాయణ, అజ్మీరా బావుసింగ్, అబ్దుల్ నబీ, శీలం రమేశ్, దాస్యం ప్రమోద్, పద్మావతి దేవిలాల్, లాల్ చందు, కోడి ఉపేందర్, కటకం పద్మావతి, కటకంచి పద్మ, తోట లలిత శారద, కొక్కు సరిత, నెమలి ధనలక్ష్మి, డేరంగుల పోశం, జబ్బర్, ఘాజి, చాంద్ పాషా, చీమల సత్యనారాయణ, రవితేజ, పోదురి లక్ష్మీనారాయణ, వీరస్వామి, కాసాని హరిప్రసాద్, సన్న రాజేశ్, హరికృష్ణ, గిన్నారపు రాజేశ్, రవికాంత్, రామ్‌లాల్ పాసి, లలిత పాసి, బండారి శ్రీను, వెంకన్న, మౌనిక, భాగ్య, కంభంపాటి రేణుక, కొండబత్తుల శ్యామ్, జాను పాల్గొన్నారు.
Yellandu : ఇల్లెందులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Yellandu : ఇల్లెందులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Yellandu : ఇల్లెందులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు