బూర్గంపహాడ్, జూన్ 13 : హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపప్లో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్వహించిన ‘గిరిజన జీవితం, సాంప్రదాయాలు, గతానుభవాలు, అంతర్ద్రుష్టులు, దూరదృష్టి’ అంశంపై ఈ 12, 13 తేదీల్లో రెండు రోజుల సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్, సమక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్, ద్రావిడ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్బయ్య చారి హాజరయ్యారు. ఈ సెమినార్లో బూర్గంపహాడ్ మండల పరిధిలోని కోయగూడెంకు చెందిన ట్రైబల్ రీసెర్చ్ ఫెలో పాయం రాజేంద్రప్రసాద్ పాల్గొని ‘కోయ గిరిజనుల ప్రాచీన ఆహారపు అలవాట్లు’ అంశంపై రాసిన వ్యాసాన్ని సమర్పించారు. ఈ సెమినార్లో ఆ వ్యాసం పలువురు ప్రముఖుల నుండి అభినందనలు అందుకోగా రాజేంద్రప్రసాద్ను శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు.