కొత్తగూడెం: కొత్తగూడెంజిల్లాకు చెందిన బరిగెల భూపేష్కుమార్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. చిన్నప్పటి నుంచి తన తండ్రి ఆశయ సాధనలో మదర్ థెరిస్సా సంస్థ నిర్వహించి నిరుపేదలైన వృద్దులకు బియ్యం, దుస్తులు పంపిణీ చేస్తూ అంబేద్కర్ యువజన సంఘానికి నాయకుడిగా ఉన్నారు.
ఎంతో మంది యువతీ, యువకులకు కరాటే, కిక్ బాక్సింగ్ తదితర విభాగాల్లో ఉచిత శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలిచారు. కరోనా సమయంలో ఎంతో మందికి అన్నదానం, వైద్య సహాయం చేయిస్తూ తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించి అనునిత్యం ప్రజలకు చేరువగా ఉంటున్న భూపేష్కు ఈ అవార్డు రావడం గర్వకారణమని మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
ఈ అవార్డుకు ఎంపికైయిన భూపేష్ ను సాబీర్పాషా, బందెల నర్సయ్య, పెయ్యాల రంగారావు, తూముల శ్రీనివాస్, సింగరాల రమేష్, అంకుష్, గుగులోత్ నగేష్, వాకపల్లి హరినాథ్, మున్సిపాలిటీ కౌన్సిలర్ కంచర్ల జమలయ్య, మాటేటి గోపాల్, ఫాయూమ్, ఖయ్యూం, నున్నా లక్ష్మీకుమారి, బరిగెల సంపూర్ణ, రత్నకుమారి, మేదిని లక్ష్మీ, మద్దెల విజయలక్ష్మీలు హర్షం వ్యక్తం చేశారు.