రామవరం, జనవరి 13 : బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, మాజీ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు, పాల్వంచకు చెందిన కాంపెల్లి కనకేష్ పటేల్‌కు చెందిన కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను పార్టీ జిల్లా కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి వనమా వెంకటేశ్వరరావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. థర్మల్ విద్యుత్ వల్ల కాలుష్యం పెరుగుతుందని, విద్యుత్ తయారీకి ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. కావునా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై సోలార్ అమర్చుకుంటే ఎవరింటికి సరిపడా వారు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా కాలుష్యం తగ్గుతుందన్నారు. గృహ అవసరాలకు సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు. అంతేకాకుండా బ్యాంక్ రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దిండిగల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, మల్లెల రవిచంద్ర, కొట్టి వెంకటేశ్వర్లు, వేల్పుల దామోదర్, లకావత్ గిరిబాబు, మంతపురి రాజు గౌడ్, కోడి అమరేందర్, గోపిరెడ్డి, కాపు కృష్ణ, కాలేరు సింధు తపస్వి, బాదావత్ శాంతి, లావుడ్య సత్యనారాయణ, గోవాడ గుణ చరిత్, తోటలోహిత్ సాయి, నవతన్, బట్టు జవహర్, ఇర్ఫాన్, కాలేరు అఖిల్, మహర్షి పాల్గొన్నారు.