ఐటీసీ యాజమాన్యం వివరణ కోరిన జేసీఎల్
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో 14వ వేతన ఒప్పంద జాప్యానికి సంబంధించి వరంగల్‌కు చెందిన జాయింట్ లేబర్ కమీషనర్ (జేసీఎల్) వివరణ కోరినట్లు ఐఎన్టీయూసీ మిత్రపక్షాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు..
బూర్గంపహాడ్, ఏప్రిల్ 21 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో 14వ వేతన ఒప్పంద జాప్యానికి సంబంధించి వరంగల్‌కు చెందిన జాయింట్ లేబర్ కమీషనర్ (జేసీఎల్) వివరణ కోరినట్లు ఐఎన్టీయూసీ మిత్రపక్షాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ నెల 13న వరంగల్ జాయింట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఐటీసీ వేతన ఒప్పంద జాప్యం, కార్మిక సమస్యలకు సంబంధించి వినతిపత్రం అందజేశామని, దీనికి సంబంధించి జేసీఎల్ ఐటీసీ యాజమాన్యాన్ని ఈ సమస్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఓ పత్రాన్ని ఐఎన్టీయూసీ ద్వారా అందించడం జరిగిందన్నారు. ఐటీసీ యాజమాన్యం, గుర్తింపు సంఘం నిర్లక్ష్య ధోరణితో కార్మికుల హక్కులకు భంగం కలుగుతున్నందున జేసీఎల్ జోక్యం చేసుకుని యాజమాన్యాన్ని వివరణ కోరినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్మిక సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని వారు పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

