రామవరం, జూన్ 21 : స్వరాష్ట్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంకుబాపన అనుదీప్ అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో పరిధిలోని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణంలో గల జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని, తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని జయశంకర్ సార్ అని కొనియాడారు.
తెలంగాణ ప్రజలను సమీకరించి, రాజకీయ సమీకరణ ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేలా చేసిన వ్యూహకర్త అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, సిపిఐ పార్టీ రుద్రంపూర్ సెక్రెటరీ తోటరాజు, గూడెల్లి యాకయ్య, మందుల జయరాజు, మొహమ్మద్ ఉమర్ ఫారూఖ్, సౌల శ్రీనివాస్, ఫయాజ్, కత్తి రమేశ్, మునవర్, గూడెల్లి ముఖేశ్, ఎన్.డి రవితేజ, గుట్ట కింద శీను, గాదం శ్యామ్, రామచందర్ పాల్గొన్నారు.