ఇల్లెందు, ఏప్రిల్ 02 : ఇల్లెందు మండలం విజయలక్ష్మి నగర్ గ్రామ పంచాయతీలో గురువారం జల మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ చాందావత్ రమేశ్ బాబుతో కలిసి మిషన్ భగీరథ డీఈ పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు మంచినీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ముందుగా వాటర్ ట్యాంక్ దగ్గర నుండి ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలకు బోరు నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు, ఆర్వో వాటర్ పై టెస్టింగ్ చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు బాలాజీ, చంద్రశేఖర్, పంచాయతీ సెక్రెటరీ రజనీకాంత్, ఉప సర్పంచ్ రేణుక, వార్డు సభ్యులు సదా, రేణుక, గ్రామస్తులు పాల్గొన్నారు.

విజయలక్ష్మినగర్లో జల మహోత్సవ ర్యాలీ