రామవరం, ఆగస్టు 06 : తెలంగాణే శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా.. తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా బతికిన వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సంకుబాపన అనుదీప్ అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణంలో ఉన్న జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యమకారుడి నుంచి మహోపాధ్యాయుడి దాకా ఎన్ని ఆటుపోట్లు ఎదురొచ్చినా, ఎన్నెన్నో కుట్రల కత్తులు దూసినా, వెన్ను చూపని, వెనకడుగు వేయని వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు.
ఒంటరైనా తన గళం విప్పారు. ఎలుగెత్తిన నినాదం ఆపలేదు. కోట్లాది జనుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. సాకారం అయ్యేదాకా ఆశయాన్ని బతికించినట్లు తెలిపారు. ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ప్రజలను ముందుకు నడిపారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గూడెల్లి యాకయ్య, బావు సతీశ్, మొహమ్మద్ మునవర్, గూడెల్లి ముఖేష్, మాచర్ల ప్రదీప్, మంద జయరాజు, ఎన్.డి.రవితేజ, పవన్, సిపిఐ పార్టీ రుద్రంపూర్ పార్టీ సెక్రెటరీ తోటరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ ఉమర్, నిమ్మల సాగర్, మొహమ్మద్ అజీజ్ ఖాన్, జయం ఆఫీస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.