– కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీకి మాజీ జడ్పీటీసీ మద్దతు
బూర్గంపహాడ్, ఏప్రిల్ 09 : గత కొన్ని రోజులుగా కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపడుతున్నా ఐటీసీ యాజమాన్యం పట్టించుకోక పోవడం శోచనీయమని, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఐటీసీపై ఉందని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత కార్మిక పక్షాన నిలబడి మద్దతు తెలిపారు. గురువారం 15వ రోజుకు రిలే నిరాహార దీక్షలు చేరడంతో బీఆర్ఎస్ నాయకులతో శిబిరం వద్దకు వెళ్లిన ఆమె కార్మికులతో కలిసి రిలే దీక్షల్లో పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 రోజులు పూర్తయినా ఐటీసీ యాజమాన్యం నుండి ఎలాంటి పిలుపులేదని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే వారిని ఐటీసీ యాజమాన్యం తక్షణమే చర్చలకు పిలవాలన్నారు.
ఈ రిలే దీక్షలకు బీఆర్డీయూ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్రెడ్డి, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీను, యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మిచైతన్యరెడ్డి, కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు కుందూరు పెద్దిరెడ్డి, తాళ్లగొమ్మూరు సర్పంచ్ గుమ్మడి కృష్ణవేణి, బీఆర్ఎస్ నాయకులు చల్లకోటి పూర్ణ, వెంకటరమణ, చట్టు ఆంజనేయులు, సురేష్, శ్రీను, యారం వెంకటరెడ్డి, యక్కంటి నరేష్రెడ్డిలు కార్మికుల దీక్షకు మద్దతు పలికారు. ఈ దీక్షా శిబిరంలో కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్పాషాతో పాటు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.