ఇల్లెందు, అక్టోబర్ 08 : గిరిజన ఆశ్రమ పాఠశాల పరిధిలో ఉన్న హాస్టల్స్ పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్లు, వారికి గతంలో ఇచ్చిన వేతనాలను తగ్గించి ఇచ్చిన జీఓ నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తున్నారు. బుధవారం ఇల్లెందు పట్టణం మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్లో పని చేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు, ఔట్సోర్సింగ్ వర్కర్లు, సిఐటియు నాయకులతో కలిసి నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 27వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు అబ్దుల్ నబీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రతి నెలా రూ.26 వేల వేతనం ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం రూ.11,000 చేస్తూ జీఓ నంబర్ 64ను ఇచ్చి ఔట్ సోర్సింగ్, డైలీ వేజ్ వర్కర్ల పొట్ట కొట్టడం సరికాదని, వెంటనే ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలో వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, సనప లక్ష్మణ్, ప్రసాద్, మంగ, కోటమ్మ, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, లక్ష్మీ, వెంకట లక్ష్మి పాల్గొన్నారు.