రామవరం, సెప్టెంబర్ 03 : సీఎం రేవంత్ రెడ్డి చంద్రుగొండ పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు 19వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పూర్ణచందర్ ను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి స్టేషన్ కు వెళ్లి వారిని పరామర్శించారు. యూరియా ఇవ్వడం చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అరెస్టు చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. యూరియా కోసం ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరైంది కాదన్నారు.
రైతులను లైన్లో పెట్టి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు హుస్సేన్, రమణ, ఖాజా భక్ష్, సుందర్ పాసి,అశోక్, భాషిర్ పాల్గొన్నారు.