పాల్వంచ, జూన్ 14 : అంతర్జాతీయ ఒలింపిక్ డే ను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్‌రెడ్డి కోరారు.శనివారం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జూన్ 23ను పురస్కరించుకుని ఈ నెల 18 నుండి 23వ తేదీ వరకూ ఒలింపిక్ దినోత్సవ రన్ ను అశ్వరావుపేట నియోజకవర్గం నుండి మొదలుకుని కొత్తగూడెం నియోజకవర్గం వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ రన్లో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొనాల్సిందిగా కోరారు.
ప్రతి నియోజకవర్గంలో ఒలింపిక్ డే రన్ విజయవంతం చేయడం కోసం క్రీడాకారులు, క్రీడాభిమానులు, వివిధ క్రీడా సంఘ నాయకులు, కోచ్ లు, పుర ప్రముఖులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యుడు నాగ సీతారాములు, ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ మహిదర్, వైస్ ప్రెసిడెంట్లు వై.వెంకటేశ్వర్లు, మొగిలి జాయింట్ సెక్రటరీలు ఆదినారాయణ, శ్రీధర్, ట్రెజరర్ కాశి, హుస్సేన్ పాల్గొన్నారు.