రుద్రంపూర్, ఏప్రిల్ 07 : సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్లో మంగళవారం ఇంటర్ ఏరియా ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్ 2025 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రథమ చికిత్స నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ పోటీలలో ఫస్ట్ ఎయిడ్ హోల్డర్లు, ఉద్యోగులు, సహోద్యోగికి కరెంట్ షాక్ తగిలిన సందర్భంలో ప్రాణాలు ఎలా కాపాడాలో ప్రాక్టికల్ డెమో ద్వారా వివరించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ షాక్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్పష్టంగా చూపించారు. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగుల్లో అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించే సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు, భద్రతపై అవగాహన మరింత బలపడింది అని కార్మికుల అన్నారు.
ఫస్ట్ ఎయిడ్ కన్వీనర్ సి.ఆర్.బి. ప్రసాదరావు ఆధ్వర్యంలో, కో-కన్వీనర్ డాక్టర్ పి. శేషగిరిరావు, రెస్క్యూ స్టేషన్ హెడ్ ఓవర్ మెన్ బి.నాగేశ్వరరావు, ఏ.ఎస్.ఓలు ముక్కపాటి వెంకటేశ్వరరావు, ఇల్లెందు ఏరియా ప్రతినిధులు, వర్క్ షాప్ హెచ్.ఓ.డి జె. క్రిస్టఫర్, వైస్ ప్రెసిడెంట్ ఎం.డి.రజాక్, సేఫ్టీ ఆఫీసర్ ఐ.అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఇంజనీర్లు బి.శంకర్, టి.అనిల్, ఏ.ఉపేందర్ బాబు, యూనియన్ ప్రతినిధులు ఎండీ.సత్తార్ పాషా (ఐఎన్టీయూసీ), ఎం. మధు కృష్ణ (ఏఐటీయూసీ), ఫస్ట్ ఎయిడ్ టీం కెప్టెన్ ఎం.అశోక్, సభ్యులు శ్రీకాంత్ శర్మ, బత్తుల శ్రీనివాస్, ఎన్.వెంకటేశ్వరరావు, గరిగ హరీష్, ఫస్ట్ ఎయిడ్ రూమ్ ఇన్చార్జి ఎస్.కే.ఖాజా పాషా, మహిళా ఉద్యోగులు, అప్రెంటిస్లు, డీఎల్ఆర్ కార్మికులు పాల్గొన్నారు.