– హాజరైన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
బూర్గంపహాడ్, మే 06 : బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ పోతూలరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై పూజలో పాల్గొన్నారు. రేగాకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అర్చకులు, వేద పండితులు ధ్వజస్తంభ పూజలు శాస్త్రోకంగా నిర్వహించి హోమాలు చేసి ప్రతిష్ఠ చేశారు. ఆలయ అభివృద్ధికి రేగా కాంతారావు రూ.50 వేలు నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, రామకొండారెడ్డి, ఉప సర్పంచ్ యారం పున్నారెడ్డి, పోతిరెడ్డి గోవిందరెడ్డి, పాలెం దివాకర్‌రెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

లక్ష్మీపురంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ