చండ్రుగొండ, ఏప్రిల్ 22 : ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో తమకు అన్యాయం చేశారని పేర్కొంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన హరిజన, గిరిజనులు మంగళవారం నిరసన తెలిపారు. మద్దుకూరు పంచాయతీకి 42 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా పేదలను, వితంతువులను ఎంపిక చేయకుండా ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని వారు ఆరోపించారు. నిరుపేదలను విస్మరించడంపై అధికార పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామస్తులు రాయలదుర్గ, రాయల రాజమ్మ, పద్దం జయ, కాంపాటి మౌనిక, చెంగలి మరియమ్మ, కాంపాటి సుశీల, కొమ్మజర్ల విజయలక్ష్మి, కాంపాటి కవిత, శారద, నాగమణి, ప్రమీల పాల్గొన్నారు.
Chandrugonda : ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అన్యాయం.. మద్దుకూరు గ్రామస్తుల నిరసన