చండ్రుగొండ, ఏప్రిల్ 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పంచాయతీ అయ్యన్నపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు దక్కడం లేదు. గ్రామంలో ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికార పార్టీ నాయకులు లంచాలు ఇచ్చిన వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు ఆరోపిస్తున్నారు.
పేదలు, వితంతువులు, దివ్యాంగులకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇండ్లు, అనర్హులు, ఆస్తులు ఉన్నవారికి ఇచ్చినట్లు దుయ్యబట్టారు. అధికారులు సైతం ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన వివరాలు నమోదు చేసుకుని కనీస విచారణ చేపట్టలేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. అయ్యన్నపాలెం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Chandrugonda : అయ్యన్నపాలెంలో అర్హులకు దక్కని ఇందిరమ్మ ఇండ్లు