రామవరం, జూలై 23 : తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మసీదుల్లో సేవలందిస్తున్న ఇమాం, మౌజన్ల గౌరవ వేతనం కొనసాగించేందుకు వారు తమ ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 31వ తేదీలోపు సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధాయ ధ్రువీకరణ పత్రం, మసీదు కమిటీ నుంచి సర్వీస్ సర్టిఫికెట్ ను ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలోని వక్ఫ్ బోర్డు అధికారికి అందజేయాలని సూచించారు. పత్రాలు సమర్పించని యెడల గౌరవ వేతనాలు రద్దయ్యే అవకాశం ఉందన్నారు. వివరాలకు 8520860785 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.