రామవరం, సెప్టెంబర్ 20 : ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ జనపరెడ్డి గోపి కృష్ణ అధ్యక్షతన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం కొత్తగూడెం జిల్లా కోర్టులో నిర్వహించారు. కొత్తగూడెం కోర్టు న్యాయవాదులు ఎర్ర శ్రీనివాసరావు, సాయి లహరి తదితరులు సభ్యత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అంబటి రమేష్, యెర్రాపాటి కృష్ణ, మారపాక రమేష్, మహమ్మద్ సాదిక్ పాషా, అంకుష్ పాషా పాల్గొన్నారు.