– సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి రాథోడ్
టేకులపల్లి, జనవరి 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొత్తతండా (పీ) గ్రామానికి చెందిన కొందరిపై అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి అధికార బలంతో అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులు గురి చేస్తున్నట్లు సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి రాథోడ్ తెలిపారు. శనివారం టేకులపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. టేకులపల్లి మండలంలోని కొత్తతండా (పీ) గ్రామంలో ఇటివల జరిగిన కొన్ని సంఘటనల్లో అదే గ్రామ అధికార పార్టీకి చెందిన భూక్య సరిరామ్ పోలీసులతో అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. గ్రామంలో ఓ కుంటుంబం ఇంటికి వెళ్లి వారిని కొట్టి మరలా వారిపైనే కేసులు పెట్టించినట్లు తెలిపారు. ఓ మహిళ పురుగుల మందు తాగి మరణిస్తే మృతి కారణాలు తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదుకు వెళ్తే వారిపైనే దాడి చేశాడన్నారు. ఓ కుటుంబం పండుగకు ఊరు వస్తే కుటుంబీకుల మద్య చిన్న గొడవ జరిగితే ఇరువురు మధ్య కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టించాడన్నారు.
పదో తరగతి విద్యార్థి ఇంటికి వస్తుంటే తన తాతను తిడితే ఎందుకు తిడుతున్నామని పశ్నించినందుకు గాయాలయ్యేలా కొట్టాడు. అధికార బలంతో కేసులు అన్యాయంగా పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు కేసులను పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలని, అధికార పార్టీ చెందిన నాయకులు చెప్పింది విని, తిరిగి తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా నాయ్యం జరగడం లేదని, ఆక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. బాధితులు భూక్య లక్ష్మీ, భూక్య బాలాజీ, మాలోత్ చందు, భూక్య భాను ప్రకాష్, భూక్య పద్మ, భూక్య సునీత, బానోత్ కళ్యాణ్, బాసతో మహేష్, భూక్య గణేష్, భూక్య ఉత్తేజ్, భూక్య రాంచరణ్, భూక్య రాజేష్, భూక్య బాలజీ పాల్గొన్నారు.